గార: ఘనంగా శ్రీ పాతాళసిద్ధేశ్వర స్వామి వారి కళ్యాణం

76చూసినవారు
గార: ఘనంగా శ్రీ పాతాళసిద్ధేశ్వర స్వామి వారి కళ్యాణం
గార మండలం శ్రీకూర్మం గ్రామంలో  శ్రీ బాలా త్రిపుర సుందరి సహిత పాతాళ సిద్ధేశ్వర స్వామి వారి కళ్యాణం మహోత్సవం ఆలయ ప్రధాన అర్చకులు పెంట జగన్నాథ శర్మ, అర్చకులు యిప్పిలి శ్రీనివాస్ శర్మల ఆధ్వర్యంలో ఆదివారం ఘనంగా జరిగింది. ముందుగా మాడవీధుల్లో శ్రీ పార్వతీ పరమేశ్వరుల ఉత్సవ మూర్తులను వృషభ వాహనంపై ఊరేగించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆలయ కార్యనిర్వాహణాధికారి గురునాధ రావు, భక్తులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్