శ్రీకాకుళం మండలంలో కిష్టప్పపేట, మామిడివలస, మునసబుపేట గ్రామాల్లో పార్టీ శ్రేణులతో కలిసి శనివారం శాసనసభ్యులు గొండు శంకర్ పర్యటించారు. ఇంటింటికి వెళ్లి ప్రజల సమస్యలు తెలుసుకున్నారు. రాష్ట్ర అభివృద్ధి, సంక్షేమ పథకాలను వివరించారు. ఇచ్చిన హామీలను అమలు చేశామని, తొలి అడుగు కార్యక్రమం ద్వారా ప్రజల మధ్యకి వచ్చామని అన్నారు.