పాలకొండలోని యాలం గ్రామంలో ఆదివారం అగ్ని ప్రమాదం జరిగిందని పాలకొండ అగ్నిమాపక అధికారి జామి సర్వేశ్వరరావు తెలిపారు. గ్రామ సమీపంలోని వరి గడ్డి కుప్ప దగ్ధమైనట్లు ఆయన తెలిపారు. సిబ్బందితో వెళ్లి మంటలు అదుపు చేశామని.. చుట్టు పక్కల వ్యాపించకపోవడంతో ప్రమాదమేమి లేదని సర్వేశ్వరరావు అన్నారు. పశువుల కోసం నిల్వఉంచిన వరి గడ్డి అగ్నికి కాలి బూడిదయ్యిందని పశువుల యజమాని పుర్రె దాలినాయుడు ఆవేదన వ్యక్తం చేశారు.