విద్యార్థుల్లోని అజ్ఞాన తిమిరాలను తొలగించేవాడే గురువు అని శ్రీకాకుళం ఎమ్మెల్యే గొండు శంకర్ అన్నారు. కిష్టప్పపేట గ్రామంలో మరియు శ్రీకాకుళం ఠాగూర్ పబ్లిక్ స్కూల్ తో పాటు నియోజకవర్గంలోని అన్ని ప్రైవేటు పాఠశాలల్లో గురువారం 5000 మంది ఉపాధ్యాయులను శాలువాతో సత్కరించి సర్టిఫికెట్లను, మెమొంటో లను అందజేశారు. ముందుగా పాఠశాలలోని సర్వేపల్లి రాధాకృష్ణ న్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు.