అరసవిల్లిలో రథసప్తమి వేడుకలు రాష్ట్ర పండగగా నిర్వహించిన తొలిసారి జిల్లా యంత్రాంగం చేసిన ఏర్పాట్లు భక్తులు, పర్యాటకుల మనస్సును హత్తుకున్నాయి. మూడు రోజుల ఉత్సవాల్లో భాగంగా తొలిసారిగా హెలికాప్టర్ రైడ్ మూడురోజులపాటు నిర్వహించనున్నారు. అయితే ప్రజల డిమాండ్ మేరకు బుధవారం ఫిబ్రవరి 5 వరకు పొడిగించినట్లు డ్వామా పి. డి బి. సుధాకర్ తెలిపారు.