భారీగా తగ్గిన టమాటా ధరలు

54చూసినవారు
భారీగా తగ్గిన టమాటా ధరలు
కొన్ని రోజులుగా దడ పుట్టిస్తున్న టమాటా దరలు దిగి వచ్చాయి. ప్రస్తుతం శ్రీకాకుళం మార్కెట్ లో కేజీ రూ. 50 నుంచి రూ. 60 మధ్య విక్రయిస్తున్నారు. అయితే రెండు వారాలుగా కేజీ రూ. 100 వరకు పెరిగిన టమాటా ధర క్రమంగా దిగి వస్తుంది. సరఫరా పెరగడంతో రేట్లు తగ్గాయని వ్యాపారస్తులు చెబుతున్నారు. టమాటా ధర పెరగడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. అయితే ఇప్పుడు టమాటా ధర తగ్గడంతో టమాటా విక్రయాలు పెరిగాయి.

సంబంధిత పోస్ట్