సరిహద్దు ప్రాంతాల నుంచి గంజాయి అక్రమ రవాణాని జిల్లాలో పూర్తి స్థాయిలో అరికట్టాలని పోలీసు అధికారులను జిల్లా ఎస్పీ కెవి మహేశ్వర రెడ్డి అదేశించారు. శుక్రవారం జిల్లా పోలీసు కార్యాలయంలో డిఎస్పీలు, సీఐలు, ఎస్ఐలతో పెండింగ్, ముఖ్యమైన నేరాలకు సంబంధించి కేసులపై జిల్లా ఎస్పీ నెల వారి నేర సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు. అపరిష్కృతంగా ఉన్న తీవ్రమైన కేసులలో దర్యాప్తు సాక్ష్యాధారాలతో పురోగతి సాదించాలన్నారు.