2024-25 విద్యా సంవత్సరానికి సంబంధించిన పీజీ కోర్సుల్లో మిగిలిన సీట్లకు ఈనెల 29న తక్షణ ప్రవేశాలు నిర్వహించనున్నట్లు డా.బి.ఆర్. అంబేద్కర్ యూనివర్సిటీ రిజిస్ట్రార్ డా. పి. సుజాత బుధవారం ప్రకటించారు. ఈ ప్రవేశాలు ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు నిర్వహించబడతాయని, ఏపీ పీజీసెట్ 2024 అర్హత లేకుండా డిగ్రీ ఉత్తీర్ణత ఆధారంగా ప్రవేశాలు జరుగుతాయని తెలిపారు. ఉపకార వేతనాలు, హాస్టల్ వసతి వంటి సదుపాయాలు వర్తించవని వివరించారు.