అమరత్వం చెందిన వీరులకు మరణం లేదని, వారి ప్రాణ త్యాగాలే సాగే పోరాటాలకు మార్గ నిర్దేశం చేస్తున్నాయని సి. పి. ఐ (ఎం. ఎల్) న్యూడెమోక్రసీ శ్రీకాకుళం జిల్లా కమిటి సభ్యులు గొరకల బాలకృష్ణ, పీవోడబ్ల్యూ జిల్లా ప్రధాన కార్యదర్శి పి. కుసుమ బుధవారం అన్నారు. బొడపాడులో అమర వీరుల స్మారక భవనంలో కామ్రేడ్స్ వెంపటాపు సత్యం, ఆదిభట్ల కైలాసం 54వ వర్థంతి నిర్వహించారు. వారి చిత్రపటాలకు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు.