కావలిలో ఘనంగా స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు
By Lalitha 60చూసినవారుమహానీయుల త్యాగఫలితమే స్వాతంత్య్రం వచ్చిందని కావలి గ్రామ సర్పంచ్ తమ్మినైన రవీంద్రనాయుడు అన్నారు. గురువారం కావలిలో స్వాతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్బంగా సర్పంచ్ మాట్లాడుతూ మహనీయుల ఆశయ సాధనకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలన్నారు. ఈకార్యక్రమంలో పంచాయతీ సెక్రటరీ సిహెచ్ సురేంద్ర కుమార్, ఉపసర్పంచ్ టి. పార్వతి, ఎ. చిరంజీవి, రమణికుమారి, రాము, పోలినాయుడు, మోహన్, నీలారావు తదితరులు పాల్గొన్నారు.