జలుమూరు మండలం యలమంచిలి గ్రామంలో ఆలయాల గోడలపై ఏసుప్రభు స్లొగన్స్ రాసిన ముగ్గురు నిందితులను పోలీసులు అరెస్టు చేశారు. సంబంధిత వివరాలను జిల్లా ఎస్పీ కేవీ మహేశ్వర్ రెడ్డి సోమవారం జిల్లా పోలీస్ కార్యాలయంలో మీడియాకు వెల్లడించారు. బుడితి చర్చ్ లో కానుకలు తగ్గుతాయని, యలమంచిలి గ్రామంలో చర్చ్ నిర్మాణం జరగకుండా చేయాలనే ఉద్దేశంతోనే నేరానికి గల కారణం అన్నారు. కేసు దర్యాప్తునకు 9 ప్రత్యేక పోలీస్ బృందాలతో పాటు టెక్నికల్ టీమ్స్ పనిచేసాయన్నారు. కేసును చాకచక్యంగా చేదించిన పోలీస్ బృందాలకు ప్రత్యేకంగా అభినందించారు.