ప్రతిరోజు దినచర్యలో భాగంగా యోగా చేపడితే మానసిక ఒత్తిడి దూరం అవుతుందని ఎంపీడీవో అప్పలనాయుడు తెలిపారు. శనివారం జలుమూరు మండలంలోని స్థానిక ఆదర్శ పాఠశాలలో నిర్వహించిన యోగాంధ్ర కార్యక్రమంలో భాగంగా ఆయన పాల్గొన్నారు. ఆయన మాట్లాడుతూ ప్రతి ఒక్కరు యోగాను రోజులో ఒకసారైనా చేసినట్లయితే ఆరోగ్యం లభిస్తుందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో మండల అధికారులతో పాటు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.