జిల్లాలో ఈ ఏడాది ఖరీఫ్ సీజన్ రూ. 3500 కోట్ల రుణాలు మంజూరు చేశామని జిల్లా లీడ్ బ్యాంక్ మేనేజరు ఎం. సూర్య కిరణ్ తెలిపారు. ఈ సందర్భంగా ఆయన ఆదివారం ప్రకటన విడుదల చేశారు. వచ్చే రబీ సీజన్ లో రూ. 2099 కోట్లు మంజూరు చేసేందుకు సిద్ధంగా ఉన్నామన్నారు. జిల్లాలో 50వేల మహిళ సంఘాలు ఉండగా గత ఏడాది రూ. 1200 కోట్లు రుణాలు ఇచ్చేందుకు లక్ష్యంగా పెట్టుకోగా రూ. 2200 కోట్ల రుణాలు మంజూరు చేశామన్నారు.