ఆమదాలవలస మండలం నెల్లిపర్తి గ్రామంలోని బసవన్న అనే కోడే మృతి చెందిది. గత రెండు రోజులుగా అనారోగ్యంతో బాధపడుతూ మంగళవారం మరణించినట్లు స్థానికులు తెలిపారు. గ్రామంలో తిరుగుతూ ఎవరికీ ఏమీ అనకుండా పెరిగిందని వివరించారు. అందరి దగ్గర పూజలు అందుకునేదని, ఇప్పుడు మరణించిందని ఆవేదన వ్యక్తం చేశారు. హిందూ సంప్రదాయం ప్రకారం అంత్యక్రియలు చేసినట్లు వివరించారు.