శ్రీకాకుళం జిల్లాలో 5 న్యాయస్థానాలకు ప్రభుత్వ న్యాయవాదిగా సీనియర్ న్యాయవాది వాన కృష్ణచంద్ ను నియమిస్తూ రాష్ట్ర ప్రభుత్వం గురువారం ఉత్తర్వులు జారీ చేసింది. శ్రీకాకుళం కుటుంబ న్యాయస్థానంతో పాటు ఆయనకు జిల్లా ఎస్సీ, ఎస్టీ కోర్టు, సోంపేట జిల్లా సెషన్స్ కోర్టు, శ్రీకాకుళం ప్రిన్సిపల్ అసిస్టెంట్ సెషన్స్ జడ్జి కోర్టు, ఆరువ ఎడిషినల్ సెషన్స్ కోర్టు లకు పబ్లిక్ ప్రాసిక్యూటర్ గా అదనపు బాధ్యతలు అప్పగించారు.