మాతృ శిశు మరణాలు నివారించాలని జిల్లా జాయింట్ కలెక్టర్ ఫర్మాన్ అహ్మద్ ఖాన్ వైద్యాధికారులను ఆదేశించారు. మాతృ, శిశు మరణాలపై శుక్రవారం శ్రీకాకుళం కలెక్టర్ కార్యాలయ సమావేశ మందిరంలో ఆయన సమీక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతీ కేసును డాక్టరే పర్యవేక్షించాలని ఆదేశించారు. హైరిస్క్ కేసులపై అతి జాగ్రత్తగా వైద్యాధికారులే చూడాలని ఎఎన్ఎం, సూపర్ వైజర్లపై పెట్టకూడదన్నారు. వైద్యాధికారులే ఫాలప్ చేయాలన్నారు.