తండ్యాలపేటలో 104 సిబ్బంది ఆధ్వర్యంలో వైద్య శిబిరం

59చూసినవారు
తండ్యాలపేటలో 104 సిబ్బంది ఆధ్వర్యంలో వైద్య శిబిరం
గార మండలం శ్రీకూర్మం పంచాయతీ తండ్యాలపేటలో శుక్రవారం 104 ఆధ్వర్యంలో వైద్య శిబిరాన్ని నిర్వహించారు. 104 సిబ్బంది ఆధ్వర్యంలో వైద్యాధికారి డా. విఎస్ఎస్ఎన్ మూర్తి రోగులను పరీక్షించి ఉచితంగా మందులను అందజేశారు. కాలనుగుణ వ్యాధుల బారిన పడకుండా తగిన జాగ్రత్తలు పాటించాలని రోగులకు సూచించారు. ఈ వైద్య శిబిరంలో సిబ్బంది, అధికారులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్