శ్రీకాకుళంలో మెగా జాబ్ మేళా పోస్టర్ ఆవిష్కరణ

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో నిర్వహించనున్న మెగా జాబ్ మేళా పోస్టర్‌ను బుధవారం శ్రీకాకుళం శాసనసభ్యులు గోండు శంకర్ ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో ప్రభుత్వ ఆర్ట్స్ డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్ సురేఖ పాల్గొన్నారు. ఇంటర్మీడియట్, ఐటీఐ, డిప్లొమా, డిగ్రీ, బీ ఫార్మసీ వరకు విద్యార్హత కలిగి, 18 నుంచి30 ఏళ్ల మధ్య వయస్సు ఉన్న నిరుద్యోగ యువతీ యువకులకు ఈ జాబ్ మేళా మేలైన అవకాశమని తెలిపారు.