శనివారం విశాఖపట్నంలో నిర్వహిస్తున్న నేవీ విన్యాసాలను వీక్షించేందుకు వచ్చిన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడును, సతీమణి నారా భువనేశ్వర్ ని శ్రీకాకుళం ఎమ్మెల్యే గొండు శంకర్, సతీమణి స్వాతి శంకర్ కలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆమెతో కాసేపు శ్రీకాకుళం నియోజకవర్గంలో పార్టీ, రాజకీయ పరిస్థితులను చర్చించారు. నిత్యం ప్రజల మధ్యనే ఉంటూ ప్రజల అవసరాలను తీర్చాలని సీఎం చంద్రబాబు సూచించారని ఎమ్మెల్యే శంకర్ తెలిపారు.