ముద్దాడపేట: పాఠశాలలో పిల్లల నమోదుకు స్పెషల్ డ్రైవ్

54చూసినవారు
ముద్దాడపేట: పాఠశాలలో పిల్లల నమోదుకు స్పెషల్ డ్రైవ్
ముద్దాడపేట ప్రాథమిక పాఠశాలలో పిల్లల నమోదుకు శుక్రవారం స్పెషల్ డ్రైవ్ కార్యక్రమం నిర్వహించారు. ప్రభుత్వ పాఠశాలల్లో నాణ్యమైన విద్యతో పాటు మధ్యాహ్న భోజనం, ఏక రూప దుస్తులు, పాఠ్య పుస్తకాలు తదితర వాటిని ఉచితంగానే అందిస్తారని పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు బొడ్డేపల్లి విజయమ్మ తెలిపారు. కార్యక్రమంలో ఉపాధ్యాయులు పైడి శ్రీరామ్మూర్తి, సీహెచ్ గోవిందరావు, యుఎస్ ప్రసాదరావు, ఎ. నర్మద, అంగన్వాడీ కార్యకర్త సుశీల ఉన్నారు.

సంబంధిత పోస్ట్