శ్రీకాకుళం రూరల్ మండలం బమ్మిడివానిపేట గ్రామంలో ముక్కోటి ఏకాదశి సందర్భంగా స్థానిక శ్రీ రామాలయ దేవస్థానం భక్తులతో కిటకిటలాడింది. శుక్రవారం తెల్లవారుజాము నుండే భక్తులు ఉత్తర ద్వారం గుండా దర్శనం చేసుకున్నారు. గ్రామ పురోహితులు పైడి మధుబాబు ఆధ్వర్యంలో మహిళలు హారతులు చేపట్టి స్వామి వారికి ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం భక్తులకు తీర్థప్రసాదాలు అందజేశారు.