ఇంజనీరింగ్ కార్మికులకు వేతనాలు జీఓ 36 ప్రకారం చెల్లించాలని శుక్రవారం సీఐటీయు జిల్లా అధ్యక్షులు సి. హెచ్ అమ్మన్నాయుడు అన్నారు. శ్రీకాకుళం మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయం వద్ద ఎపీ మున్సిపల్ వర్కర్స్&ఎంప్లాయిస్ ఫెడరేషన్ సీఐటీయు ఆధ్వర్యంలో మున్సిపల్ కార్మికులు ధర్నా చేపట్టారు. కమిషనర్ పీ. వీ. వీ. డి ప్రసాదరావుకు వినతిపత్రం అందించారు.