శ్రీకాకుళం ప్రభుత్వ మహిళా కళాశాలలో హిందీ అధ్యాపకులు పి. పార్వతి, ప్రముఖ సాహిత్యకార్ "మున్షి ప్రేమ్ చంద్ జయంతి" కార్యక్రమాన్ని బుధవారం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ కే. సూర్యచంద్రరావు అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సమాజంలోని లోటుపాట్లను, స్త్రీలకు జరుగుతున్న అన్యాయాలను, మూఢనమ్మకాలను నిరసిస్తూ ప్రేమ్ చంద్ అనేక రచనలు చేసారని కొనియాడారు.