నందిగాం మండలంలోని పెంటూరు వేంకటేశ్వర స్వామి ఆలయ పూజారి దుంబాలం రవిరామాచార్యులు (38) నందిగాం ఎదుర్లబందలో పడి మృతి చెందారు. ఎస్సై షేక్ మహ్మద్ ఆలీ తెలిపిన వివరాలిలా ఉన్నాయి. రవిరామాచార్యులు మంగళవారం ఉదయం వెళ్లి రవిరామాచార్యులు ప్రమాదవశాత్తూ చెరువులో పడిపోయారు. బుధవారం మధ్యాహ్నం మృత దేహం తేలడంతో స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని ఎస్సై తెలిపారు.