అధికారులు, ప్రజాప్రతినిధులు సమన్వయంతో పనిచేయాలి
By Lalitha 82చూసినవారుఅధికారులు, ప్రజాప్రతినిధులు సమన్వయంతో పని చేయాలని, శ్రీకాకుళం రూరల్ మండలాన్ని రాష్ట్రంలోనే నెం 1 మండలంగా తీర్చిదిద్దుకునేలా ప్రతీ ఒక్కరూ కృషి చేయాలని శ్రీకాకుళం ఎమ్మెల్యే గొండు శంకర్ శనివారం పిలుపునిచ్చారు. ఈ మేరకు శ్రీకాకుళం ఎంపీడీఓ కార్యాలయంలో ఎంపీపీ అంబటి నిర్మల అధ్యక్షతన మండల సర్వసభ్యసమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ప్రభుత్వ పథకాలపై సమీక్ష నిర్వహించారు.