ఒడిస్సా రాష్ట్రానికి చెందిన ఒక వ్యక్తి గంజాయి తరలిస్తుండగా అదుపులోకి తీసుకున్నట్లు కాశీబుగ్గ సిఐడి మోహన్ రావు పేర్కొన్నారు. గురువారం పలాస సమీపంలోని మొగలిపాడు వద్ద వాహనాలు తనిఖీ చేస్తుండగా రెండు కిలోల గంజాయితో సుదాంత్ సింగ్ ను అరెస్టు చేసినట్లు తెలియజేశారు. మరో నలుగురు వ్యక్తులు తప్పించుకుని పారిపోయారని సిఐ చెప్పారు. సుధాంత్ సింగ్ పై కేసు నమోదు చేసి శుక్రవారం రిమాండ్ కు తరలించనున్నట్లు వెల్లడించారు.