శ్రీకాకుళం రూరల్ మండలం నైర గ్రామపంచాయతీలో మంగళవారం పింఛన్ పంపిణీ కార్యక్రమం జరిగింది. ఉదయం 5 గంటలకే సచివాలయం సిబ్బంది వాళ్లకి కేటాయించిన క్లస్టర్ లో పింఛన్ పొందుతున్న ప్రతి ఇంటికి వెళ్లి పింఛన్ పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు, మరియు గ్రామ పెద్దలు ఇంటింటికి వచ్చి పింఛన్ ఇస్తున్నందుకు గ్రామాలలో సందడి వాతావరణం కనిపించింది. వికలాంగులు, అవ్వ, తాతలు ప్రభుత్వాన్ని అభినందిస్తున్నారు.