స్వచ్ఛత హి కార్యక్రమాల పట్ల ప్రజలు అవగాహన పరచుకోవలసిన అవసరం ఉందని జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ తెలిపారు. బుధవారం శ్రీకాకుళం జిల్లా కలెక్టరేట్ ప్రాగణంలో మహాత్మా గాంధీ, లాల్ బహుదూర్ శాస్త్రి జయంతి సందర్భంగా భారీ విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ స్వచ్ఛత పట్ల ప్రజలు అవగాహన పరుచుకుని వ్యర్ధాలను రహదారులపై పడి వేయకుండా చూడాలని ఆయన సూచించారు.