త్రాగునీటి సమస్యలకు శాశ్వత పరిష్కారం: ఎమ్మెల్యే గొండు

65చూసినవారు
త్రాగునీటి సమస్యలకు శాశ్వత పరిష్కారం: ఎమ్మెల్యే గొండు
త్రాగునీటి సమస్యలకు శాశ్వత పరిష్కారం కల్పించాలని గ్రామీణ నీటి సరఫరా విభాగం అధికారులను శ్రీకాకుళం ఎమ్మెల్యే గొండు శంకర్ శుక్రవారం ఆదేశించారు. శ్రీకాకుళంలో ఇంటింటికి కుళాయి సదుపాయం కల్పించేందుకు చర్యలు చేపట్టాలన్నారు. తాగునీటి సరఫరాకు సంబంధించి స్థానిక గ్రామీణ నీటి సరఫరా విభాగం కార్యాలయంలో అధికారులతో ఎమ్మెల్యే సమీక్ష నిర్వహించారు. తాగునీటి సరఫరాలో తలెత్తుతున్న సమస్యలపై చర్చించారు.

సంబంధిత పోస్ట్