రానున్న సోమవారం ఏప్రిల్ 14 వ తేదీన డా. బి ఆర్ అంబేద్కర్ జయంతి పురస్కరించుకొని ప్రభుత్వ సెలవు ప్రకటించిన అంశం తెలిసిందే. ఈ సంధర్బంగా శ్రీకాకుళం జిల్లా పోలీసు ప్రధాన కార్యాలయంలో నిర్వహించవలసిన ప్రజా ఫిర్యాదుల స్వీకరణ పరిష్కార వేదిక (పబ్లిక్ గ్రీవెన్స్ రెడ్రెస్సల్ సిస్టం)కార్యక్రమాన్ని సోమవారం రద్దు చేస్తున్నట్లు జిల్లా ఎస్పీ కె. వి. మహేశ్వర రెడ్డి శనివారం ఒక ప్రకటన ద్వారా తెలిపారు. అర్జీదారులు గమనించాలన్నారు.