శ్రీకాకుళం జిల్లా కోర్టు ఆవరణలో జిల్లా ప్రధాన న్యాయమూర్తి జునైద్ అహ్మద్ మౌలానా అధ్యక్షతన శనివారం జాతీయ లోక్ అదాలత్ నిర్వహించారు. ఈ జాతీయ లోక్ అదాలత్ లో సివిల్ కేసులు 143, క్రిమినల్ కేసులు 1061, పిఎల్సి కేసులు 77 రాజీ చేసినట్లు జిల్లా న్యాయమూర్తి తెలిపారు. లోక్ అదాలత్లో రాజీ చేసుకోవడం ద్వారా ఇరు పార్టీలకు న్యాయం జరుగుతుందని, దీని ద్వారా వారి మధ్య ఎటువంటి కలహాలు, మనస్పర్ధాలు ఉండవని పేర్కొన్నారు.