ఉత్తరాంధ్రలోని విజయనగరం, విశాఖ, శ్రీకాకుళం జిల్లాల్లో పలు చోట్ల ఇవాళ వర్షం కురుస్తోంది. మంగళవారం శ్రీకాకుళం, విజయనగరం, కాకినాడ, ప్రకాశం, నంద్యాల, పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామరాజు, అనకాపల్లి, అనంతపురం జిల్లాల్లో అక్కడక్కడ పిడుగులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ చెప్పిన సంగతి తెలిసిందే. దీంతో చెట్ల కింద ప్రజలు ఎవరూ ఉండవద్దు అని అధికారులు సూచిస్తున్నారు.