రణస్థలం మండలం కమ్మ సిగడాం గ్రామంలో కొలువైన శ్రీమహాలక్ష్మితల్లి జాతర సందర్భంగా ఆదివారం విజయనగరం ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు కుటుంబ సమేతంగా అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ కమిటీ నిర్వాహకులు ఎంపీకి తీర్థ ప్రసాదాలు, జ్ఞాపికను అందజేశారు. ఈ సందర్భంగా ఎంపీ అప్పలనాయుడు మాట్లాడుతూ తల్లి చల్లని ఆశీస్సులు ప్రజలందరిపై ఉండాలని కోరుకున్నట్లు తెలిపారు.