రేగిడి మండలం సంకిలి ఇఐడి ప్యారీ కంపెనీలో ఇథనాల్ తయారీ కర్మాగారాన్ని బుధవారం ఎక్సైజ్ డిప్యూటీ కమిషనర్ ఎస్. వి. వి. ఎన్. బాజ్జీ రావు తనిఖీ చేశారు. తయారీ విధానం, నిల్వలు రవాణా లాంటి వివరాలను క్షుణ్ణంగా పరిశీలించారు. కంపెనీ నిర్వాహకులకు ఇథనాల్ నిల్వల నిర్వహణలో గానీ రవాణా విషయంలో గానీ అధిక భద్రతా ప్రమాణాలు పాటించాలని, రవాణాలో ఎటువంటి అవకతవకలకు అవకాశం ఇవ్వరాదని యాజమాన్యాన్ని హెచ్చరించారు.