విశాఖ ఉక్కు ప్రవేటికరణకు వ్యతిరేకంగా భారత విద్యార్థి ఫెడరేషన్ (ఎస్ఎఫ్ఐ) నాయకులు బుధవారం శ్రీకాకుళంలో నిరాహార దీక్ష చేపట్టారు. ఈ సందర్భంగా ఎస్ఎఫ్ఐ జిల్లా అధ్యక్ష కార్యదర్శులు డి చందు బి హరీష్ మాట్లాడుతూ 32 మంది బలిదానంతో, వామపక్ష ఎంపీ ఎమ్మెల్యేల రాజీనామాలతో ఏర్పడిన సాధించికున్న వైజాగ్ స్టీల్ ప్లాంట్ ఏ ఒక్కరి సొత్తు కాదన్నారు. ఈ కార్యక్రమంలో సిహెచ్ రాజు, సంతోష్, పవిత్ర తదితరులు పాల్గొన్నారు.