మందస మండలానికి పంచాయతీ సెక్రటరీల కొరత వేధిస్తుంది. 41 పంచాయతీలు గల పెద్ద మండలానికి కేవలం 27 మంది మాత్రమే విధులు నిర్వహిస్తున్నారు. ఈ విధంగా చూసుకుంటే సుమారు రెండు పంచాయతీలకు ఒక్కరే కార్యదర్శిగా విధులు నిర్వహిస్తున్న పరిస్థితి నెలకొంది. దీంతో మండలానికి పూర్తిస్థాయి సెక్రటరీలను నియమించి గ్రామాలను అభివృద్ధి పథంలో నడిపించాలని పలువురు స్థానికులు కోరుతున్నారు.