రథసప్తమి రాష్ట్ర వేడుకగా జరుపుకుంటున్న సందర్బంగా నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు అట్టహాసంగా ముగిసాయి. ఆర్ట్స్ కళాశాల మైదానంలో విశాలమైన వేదికపై సోమవారం ముగింపు కార్యక్రమం ఆద్యంతం ఆహుతులను అలరించింది. గాయని మంగ్లీ పాటలు ప్రధాన ఆకర్షణగా నిలిచాయి. చివరగా క్రాకర్స్ షో తో కార్యక్రమాలు విజయవంతంగా ముగిసాయి.