సీతంపేట: రాష్ట్ర స్థాయి పోటీల్లో ఐటీడీఏ విద్యార్థులు

65చూసినవారు
సీతంపేట: రాష్ట్ర స్థాయి పోటీల్లో ఐటీడీఏ విద్యార్థులు
విశాఖపట్నంలో ఇటీవల నిర్వహించిన రాష్ట్ర స్థాయి క్రీడా పోటీల్లో సీతంపేట ఐటీడీఏ విద్యార్థులు ఉత్తమ ప్రతిభ కనబరిచారు. గురువారం ఈ విద్యార్థులను ఐటీడీఏ పీవో సి. యశ్వంత్ కుమార్ రెడ్డి తన ఛాంబర్లో అభినందించారు. ఈ సందర్భంగా పీవో మాట్లాడుతూ. చదువుతో పాటు క్రీడలు కూడా అవసరమని అన్నారు. క్రీడల వల్ల మానసిక ఉల్లాసం, ఆత్మవిశ్వాసం పెరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో ఏపీవో జి. చిన్నబాబు, తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్