సోంపేట మండలం పాలవలసలో శ్రీ రౌతు పోలమ్మ గ్రామ దేవత సంబరాలు అంగరంగ వైభవంగా జరిగాయి. ఈ మేరకు ఐదవ రోజు ఏర్పాటు చేసిన సాంస్కృతిక కార్యక్రమాలు అలరించాయి. పరిసర ప్రాంత గ్రామప్రజలు అధిక సంఖ్యలో పాల్గొనడంతో పండగ వాతావరణం నెలకొంది. 20వ తేదీతో మహోత్సవాలు ముగుస్తాయని చెప్పారు.