అరసవల్లి సూర్యనారాయణ స్వామి ఆలయ హుండీలను ఈనెల 11వ తేదీన లెక్కించనున్నట్లు ఆలయ కార్యనిర్వహణాధికారి వై. భద్రాజీ శుక్రవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఆరోజు ఉదయం ఎనిమిది గంటలకు దేవాదాయ, ధర్మాదాయ శాఖ సిబ్బంది, అనువంశిక ధర్మకర్త, పాలక మండలి సభ్యులు, అర్చకులు, సందర్శకులు, గ్రామ పెద్దల సమక్షంలో హుండీలను తెరవనున్నట్లు తెలిపారు.