అరసవల్లి శ్రీ సూర్యనారాయణస్వామి ఆలయంలో హుండీ ఆదాయ వివరాలను ఈవో భద్రాజి ఆదివారం వెల్లడించారు. ఈ మేరకు స్వామివారికి టికెట్లు రూపంలో రూ. 6, 78, 600, పూజలు, విరాళాల రూపంలో రూ. 1, 16, 454 ఆదాయం వచ్చిందన్నారు. ప్రసాదాల రూపంలో రూ. 2, 68, 175 వచ్చాయన్నారు. మొత్తం రూ. 10, 63, 229 సమకూరినట్లు ఆయన తెలిపారు