శ్రీకాకుళం నియోజకవర్గ ప్రజల కోసం ఎమ్మెల్యే గొండు శంకర్ నిర్వహిస్తున్న ప్రజాదర్బార్ కు ప్రజల నుంచి అనూహ్య స్పందన లభిస్తోంది. నియోజకవర్గం నలుమూలల నుంచి వివిధ వర్గాల ప్రజలు జిల్లాటీడీపీ కార్యాలయానికి చేరుకుని యువనేతకు తమ సమస్యలు బుధవారం విన్నవించుకున్నారు. ప్రతి ఒక్కరి సమస్యలను అధికారులతో చర్చించి పరిష్కారం మార్గం చూపిస్తామని శంకర్ అన్నారు. కూటమి పాలనలో అందరికీ సమన్యాయం జరుగుతుందని తెలిపారు.