కోట్లాది మంది ప్రజల మనోభావాలు దెబ్బతీసేలా తిరుమల తిరుపతి దేవస్థానంపై భూమన కరుణాకరరెడ్డి తప్పుడు ప్రచారం చేయడం తగదని శ్రీకాకుళం ఎమ్మెల్యే గొండు శంకర్ అన్నారు. శ్రీకాకుళంలోని ఎమ్మెల్యే కార్యాలయం నుంచి ఆదివారం ఒక ప్రకటన విడుదల చేశారు. కరుణాకరరెడ్డి మత విద్వేషాలు రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తున్నారని అన్నారు. గోశాలలో 100 ఆవులు చనిపోయాయంటూ కరుణాకర్ రెడ్డి చేసిన ఆరోపణల్లో వాస్తవం లేదని తెలిపారు.