శ్రీకాకుళం-2 బి. సి బాలుర కళాశాల వసతి గృహం విద్యార్థులు శనివారం విడుదలైన ఇంటర్ ఫలితాల్లో సత్తా చాటారు. ఇంటర్ ద్వితీయ సంవత్సరంలో 1000 మార్కులకు ఉపేంద్ర 976, లోహిత్ 940, కార్తీక్ 910, హరి 909 మార్కులు సాధించాడు. ప్రథమ సంవత్సరంలో 470 మార్కులకు బాలాజీ 453, సిద్ధార్థ 448, దివాకర్ 443 సాధించారు. ఉత్తమ ఫలితాలు కనబరిచిన విద్యార్థులకు జిల్లా బీసీ సంక్షేమ అధికారి ఈ అనురాధ, సహాయ సంక్షేమ అధికారి చంద్రమౌళి, హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్ బమ్మిడి వైకుంఠరావు అభినందించారు.