శ్రీకాకుళం: అరసవిల్లిలో జిల్లా కలెక్టర్ దంపతులకు ఆశీర్వచనాలు

74చూసినవారు
శ్రీకాకుళం అరసవిల్లి శ్రీ సూర్యనారాయణ స్వామి ఆలయంలో రథసప్తమి వేడుకలు ఘనంగా నిర్వహించిన సందర్భంగా జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ దంపతులను ఆలయ అర్చకులు ఘనంగా ఆశీర్వచనాలు అందజేశారు. బుధవారం రాత్రి జరిగిన ఈ కార్యక్రమంలో భాగంగా స్వామివారి జ్ఞాపికను వారికి అందజేశారు. రథసప్తమి వేడుకలు ఘనంగా నిర్వహించేందుకు కలెక్టర్ చూపిన చొరవ ఎనలేనిదని ప్రధాన అర్చకులు ఇప్పిలి శంకర్ శర్మ పేర్కొన్నారు.

సంబంధిత పోస్ట్