శ్రీకాకుళం: మరమ్మతులకు పిలిస్తే.. హతమార్చాడు

79చూసినవారు
శ్రీకాకుళం: మరమ్మతులకు పిలిస్తే.. హతమార్చాడు
శ్రీకాకుళం జిల్లా హరిశ్చంద్రపురంలో జూన్ 10న వృద్ధురాలు దుంపల దాలమ్మ (68) హత్య కేసును శుక్రవారం పోలీసులు ఛేదించారు. జూన్ 8న ఆమె ఇంట్లో మోటారు చూస్తానంటూ బల్లి రాము అనే యువకుడిని పిలిచింది. అతను ఆమె మెడలో బంగారు హారాన్ని చూసి, 9న రాత్రి ఇంట్లోకి చొరబడి ఇనుప రాడ్డుతో తలపై కొట్టి హత్య చేశాడు. పోలీసులు రామును కోటబొమ్మాళిలో అరెస్ట్ చేసి, బంగారం, రాడ్డును స్వాధీనం చేసుకున్నారు.

సంబంధిత పోస్ట్