ఇంగ్లీష్ మీడియం జి. ఒ 85ను రద్దు చేయాలని అనడం దురదృష్టకరమనీ, గ్రామీణ ప్రాంత విద్యార్థులకు ఉపయోగపడే ఇంగ్లీష్ మీడియం కొనసాగించాలని ఒ. బి. సి అసోసియేషన్ ఉత్తరాంధ్ర జనరల్ సెక్రెటరీ రౌతు శంకరరావు శనివారం శ్రీకాకుళంలో కోరారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ అన్ని ప్రైవేట్ పాఠశాలలో ఇంగ్లీష్ మీడియం పెట్టి, కేవలం ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు తెలుగు మీడియం అనడం భావ్యమా అని ప్రశ్నించారు.