ఎస్సీ వర్గీకరణను వ్యతిరేకిస్తూ ఈ నెల 29న శ్రీకాకుళం జిల్లా కేంద్రంలో నిర్వహిస్తున్న భారీ ర్యాలీ, బహిరంగ
సభను విజయవంతం చేయాలని ఎస్సీ వర్గీకరణ వ్యతిరేక పోరాట సమితి ప్రతినిధులు పిలుపునిచ్చారు. శ్రీకాకుళం
నగరంలోని ఎన్ జీఓ హోంలో గురువారం ఎస్సీ, ఎస్టీ వర్గీకరణ వ్యతిరేక పోరాట సమితి ప్రతినిధులు విలేకరుల
సమావేశం నిర్వహించారు. జిల్లాలో ఉన్న మాలలు అంతా ఈ కార్యక్రమంలో పాల్గొనాలని కోరారు.