సమీకృత కలెక్టర్ కార్యాలయ పనులను త్వరిత గతిన పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ ఆదేశించారు. జిల్లా కేంద్రంలో నిర్మాణంలో ఉన్న సమీకృత కలెక్టర్ కార్యాలయ భవన సముదాయాన్ని జిల్లా రెవెన్యూ అధికారి, రహదారులు, భవనాల శాఖ ఇంజినీరింగ్ అధికారులతో కలిసి శనివారం పరిశీలించారు. భవన నిర్మాణాలు వేగంగా చేపట్టాలన్నారు. సిబ్బందికి పలు సూచనలు చేశారు.