విద్యార్థుల్లో సృజనాత్మకతను వెలికితీయాలంటే సైన్స్ ఎగ్జిబిషన్లు దోహదపడతాయని ఎమ్మెల్యే గొండు శంకర్ పేర్కొన్నారు. శుక్రవారం శ్రీకాకుళం నగరంలోని ప్రభుత్వ హైస్కూల్లో జిల్లా స్థాయి సైన్స్ ఎగ్జిబిషన్ లో ఎమ్మెల్యే ముఖ్యఅతిధిగాముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా శంకర్ మాట్లాడుతూ సైన్స్ ఎగ్జిబిషన్ నిర్వహించడం గొప్ప విషయమన్నారు. విద్య కోసం ప్రభుత్వం ఎన్నో పథకాలను ప్రవేశపెడుతుందన్నారు.